Sep 30, 2009

నా మనసులాగా


దుమ్ముని ఎవరూ ఇష్టపడరు..
             కాని తాను అంతటా ఉండగలదు.. నా మనసులాగా ...

మనసు సొంతదనాన్ని కోల్పోతోంది...


వయసు వలపుల జ్వలలో వింత కాంతిని చిమ్ముతోంది..
మనసు తలపుల అలలలో సొంతదనాన్ని కోల్పోతోంది...
నాకు నేనే అడ్డమయ్యాను ... నన్ను నేను ఎలా దాటగలను..

నాలో ఊపిర్లూదే నేస్తానివనీ ...


నీవు నా శాశ్వత జోడివనీ  ...........
     నాలో ఊపిర్లూదే నేస్తానివనీ ...
   తెలుసు నాకు .....
                                              అయినా జీవితం పట్ల అలుసు నాకు....

                   నాకు నేనే అడ్డయ్యాను... నన్ను నేను ఎలా దాటగలను  ?

నన్ను నేను ఎలా దాటగలను...


         లోతుగా దిగిన గాజు ముక్కలు ఎదలో కలుక్కుమంటున్నాయి
       రక్తం చిందుతూ ....... కాలం ఉలిక్కి పడుతోంది
                                      త్వరగా నన్ను బయటపడమంటోంది
                            నాకు నేనే అడ్డయ్యాను.... నన్ను నేను ఎలా దాటగలను...

మౌనాన్ని వీడని ... అయోమయం నీది


నా నీడ నన్నే వెక్కిరిస్తుంటే ....
బ్రతుకు భారాన్ని చూపిస్తుంటే ...

ఏమీ చేయలేని అసక్తత నాది...
మౌనాన్ని వీడని ... అయోమయం నీది

పువ్వులా నలగటం నాకు అలవాటు అయ్యింది...
ఆ పరిమిళంలో మునిగితెలటం నీకు మురిపెంగా మారింది...

నా మనసు ... నీకు బాగా తెలుసు ....


ఉన్నదేదొ ఉత్సాహాన్నిచ్చి ............
                        లేనిదేదొ లేమిని రగిల్చి  .................
నీ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తూ వికృతం అయ్యింది మనసు !
                                దానికేమి కావాలో నీకు బాగా తెలుసు !!!

Sep 26, 2009

जानम इज़हार तो करो .... तेरी अदाए ही सही ......


जुदाई जिस्मोंकी होसकती है.... यादोंकी नहीं
बेवफाई बातो में हो सकती है .... दिल में नहीं
जानम इज़हार तो करो .... तेरी अदाए ही सही ......

Sep 25, 2009

లోతైన అనుకూలత నీవు


తీవ్ర వ్యతిరేకతల మధ్య ..... లోతైన అనుకూలత నీవు...

నీ చలవే


ప్రపంచమంతా నిప్పులు కురుస్తున్నా ...
నింపాదిగా ఉన్నానంటే అది నీ చలవే ....

Sep 24, 2009

నీ భావాలే కానుకగా నీ ముందు పెడతాను


తప్పంతా నాదేనని నిలబెడితే

తప్పుకోలేను ప్రియతమా ....

నిలబడ్డ దగ్గరే నిలువునా కరిగి పోతాను

నీ భావాలే కానుకగా నీ ముందు పెడతాను

Sep 23, 2009

కాలం


కాలమా .... నన్ను అలరించిన పిల్లగాలులు,చల్లని తీరాలు,పచ్చదనం,వెచ్చదనం,కల్లతో నవ్వే ప్రణయాలు,చిన్న చిన్న ఎడబాటులు,అద్భుతమైన ప్రదేశా లు,నన్ను అల్లుకున్న పసి హృదయాలు,ఆనందాలు,అవకాశాలు,విరహాలు, విలాపాలు,........అన్నీ నీలో నిక్షిప్తమై ఉన్నాయి....

ప్రేమ స్వరూపమా .... నేను చేయగల్గిందంతా నీవు నాకు అందించిన ప్రతి క్షణాన్ని అంగీరించటమే !!!
నీవు అందించిన అమృతాన్ని అందరితో పంచుకోవటం ....
నీవు అనుగ్రహించిన హాలాహలాన్ని ఒక్కన్నే అనుభవించటం....... 
ఆపై విష ప్రభావాన్ని వింత భావాల్లో నింపి కవిలు అల్లటం ...
నీ పాదాలకు వాటిని అంకితం చేయటం...
ఇదే తెలుసు నాకు కాలమా .... ఓ కాలకూఠమా ....
నాకు దేనిని నిందించాలి అనిపించదు..నీవు అందించిన ప్రేమ అలాంటిది ....

లేని దాని గురించి కాక ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని ...
 నీలో ఎలా అద్భుతంగా నిలిచి  పోవాలని నా ఆరాటం.. 
భవిష్యత్తు,యావత్తూ నీలోనే ఉంది 

నీలో నేను... నాలో నీవు.... నిరంతర పయణం ...
సాగి సాగి ఏదో ఒకరోజు నన్ను ఆపుతావు...
నీవు కొనసాగుతావు ...
నీకు హారంగా మిగులుతాయి నా భావాలు ...
అదే నాకు పదివేలు ...

Sep 22, 2009

నిన్ను చేరి



  
 నా అసంపూర్ణ భావాలు బయలు దేరాయి... నిన్ను చేరి సంపూర్ణం అవుదామని..

అనుభూతి

మెలకువలో పొందిన అనుభూతి .. రాత్రివేళ అందమైన కన్నెలా కలవరపెడుతూ ఉంది...

అదే పనిగా ... అదికూడా




అదేపనిగా చేస్తున్నానంటే ... అది నీకోసమై ఉంటుంది...

అదికూడా చేస్తున్నాను అంటే ... అది ప్రపంచం కొసమై ఉంటుంది..

Sep 16, 2009

క్షమించు...

                                    
నీ అధీనం లో ఉండటం పరాధీనమయితే క్షమించు
మరువలేను నిన్ను మన్నించు
నిన్ను ఆశించటం కుసంస్కారమయితే క్షమించు
వ్యక్తీకరణ వ్యక్తి తప్పయితే క్షమించు
బాధను భావముగా తెలపటం రాదు క్షమించు
నీకై కరిగిన ఈ గుండెని క్షమించు
నాది పుష్ప పరాగ వివశత మన్నించు
చల్ల గాలికి మెఘం వర్షిస్తే .. మేఘాన్ని క్షమించు
దాచటం తెలియదు ... దాచలేను .... క్షమించు
నిన్ను చూసినందుకు ... నా కళ్ళను క్షమించు
నీ మృదువచనాలు విన్న చెవులను మన్నించు
ఇన్ని భావాలను ఆగకుండా సృష్టిస్తున్న నా మనసుని క్షమించు
నీ పేరుతో స్పందించే .. ఈ హృదాయాన్ని క్షమించు
నేను అర్థం కాక పొతే క్షమించు
నా జీవితం వ్యర్తమైనా నీ ప్రేమను మరువను క్షమించు
కదలని చూపులతో కాలం కదిలిస్తున్నా క్షమించు
నా నిదురకూడా నన్ను క్షమించటం లేదు .. నీవైనా క్షమించు
నన్ను నేను క్షమించలేక పోతున్నాను నీవైనా క్షమించు

Sep 11, 2009

వెలుగుల పులుగులు


మేము పక్షులం .. కడుపు నిండా తినటం , తనివి తీరా ఎగరటం మా నైజం ....
మా పక్షులకు ఆకలి మాత్రమే తెలుసు ... రుచుల కోసం వెంపర్లాడము
మాకు నిన్నటికి సంబంధించిన భారం ఉండదు
రేపటి కోసం ఆరాటమూ ఉండదు ..
వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ప్రకృతిని నిందించము
ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమి చేసుకోము .. పిల్లల కోసం ఒక గూడు .. దానిలోనే ఒకరికొకరం తోడు
ప్రేమ పేరు మీద మారణ హోమాలు మాకు తెలియవు
ఆడ పక్షి కువ కువ కూజితాలతో ఓ విచిత్రమైన అరుపులతో ఒక అలజడి సృష్టిస్తుంది
ఆ తరంగాలు మగ పక్షిలోని రసనేంద్రియాలను జాగృతి చేస్తుంది
ఆ పై ఒక బిగి కౌగిళి .....
మా శృంగారం మనసు పై ఆధార పడి ఉంటుంది .. దుస్తువులపై కాదు..
మా వలపుకు శరతులు ఉండవు .....
సిధ్ధాంతాలు రాధ్ధాంతాలు తెలియవు
మేము బ్రతికేది జీవితమని కూడా తెలియదు
కేవలం ఈ క్షణం ఇక్కడే బ్రతికేస్తూ ఉంటాము
అందరికీ అందరం ...ఒకరికి ఒకరం ... వలస వెల్లినా వరుసగా వెళ్తాం
అనవసరపు సలహాలు ... అనుమానాలు .. అవమానాలు ...
కర్ణకఠొరపు మాటలు , హేళనలు వెకిలి చేష్టలు ఉండనే ఉండవు
పిల్లల్ని పెంచటానికి ఎంత అనుబంధాన్ని పెంచుకుంటామో అంతే కఠువుగా బంధనాలు తెంపుకుంటాము
ఆర్థికంగా ఎవ్వరిపై అధారపడేది  ఉండదు కాబట్టి మొసాలు ఉండవు
డబ్బుకు సంబంధించిన జాఢ్యాలు మా దరి చేరవు
రసాయణ ఎరువుల వల్ల మేము తినే గింజల్లోని విషంతో మా సంతతి తగ్గుతూ ఉంది
అమాయకత్వం తప్ప బయట పడే ఆలోచన తెలియని మమ్మల్ని, మేధావులుగా పెరు పడ్డ మనుషులు
ఆదుకుంటారని అది కూడా వారి స్వార్థం కోసమే ఆదుకొమ్మని ఒక చిన్న విన్నపం ......
మనుషులతో నా విషయాలను పంచుకునే అవకాశం ఇచ్చిన భగవంతునికి ఋణపడి ఉంటాము
ఇట్లు
వెలుగుల పులుగులు

Sep 9, 2009

A red rose is in love



A red rose is in love
being mesmarised in a red radiant romantic wave
each petal of it is becoming heavy
feeling as fascinatedly savvy

Sep 7, 2009

నేను కనుమరుగయ్యాను ..



స్నేహం చెరిగిపొదామా అన్నది ....
ప్రేమ నేనున్నాను చెలరేగిపో అన్నది....
అర్థం కాని మనసు.... నన్ను అదోలా చూసింది 
నేను కనుమరుగయ్యాను .......
పాత జీవితం గల్లంతు... 
కొత్త జీవితం మొదలు పెట్టటానికి ......

Sep 5, 2009

నీలో నింపాదిగా ఈదుతూ

నా మనసు తాబేలులా తయారయ్యింది.
నీ ప్రణయంలో వేగంగా ఈదుతూ ,
 ప్రపంచం లో నెమ్మదిగా ముందుకు కదులుతుంది.

Sep 4, 2009

హృదయంలో చీకటి పడింది....
                         నీ జ్ఞాపకాలు తారల్లా మెరుస్తున్నాయి

కన్నీరు


ఇది విలాపం కాదు నెస్తమా..!!
నీ భావలతో కందిన హృదయం విడుదల చేసిన వింత రసాయణం

అంతా ... నీవల్లే




నీవు వేరు , నీ మనసు వేరా ? అని అడిగింది ప్రేమ ...


అవును , అంతా ... నీవల్లే అన్నాను నేను...

మరణం నాది ....కరుణ నీది


మధ్యే జీవితాన్ని తెరిచాను ...  
                          నీకోసం మరణించటానికి ...
గొప్ప భావమై హత్తుకున్నావు .
                         ఈ అసంపూర్ణుడిని కరుణించటానికి.

వజ్రం


  వజ్రం - తరతరాలుగా తనను తాను మలుచుకున్న ఒక బొగ్గు...
         అందుకే బహుశా స్త్రీలు దీనిని అమితంగా ఇష్టపడతారు..

Sep 2, 2009

మనుషులు .... మృగాలు



మనసును చదవగలవారే మనుషులు ... మిగిలినవి మృగాలు

"నన్ను తప్పు పడుతున్నారంటే .. నా పట్ల వారికి వున్న అభిప్రాయాన్ని తప్పు పడుతున్నారంతే "

ఆధారం


                    ఆధార పడటం లో గొప్ప స్వాంతన వుంది..  
                                    అది ఆధారం గొప్ప దైనప్పుడు మాత్రమే

నిప్పు కంటే ముప్పు కాదా నువ్వు ?


నీవు ఒప్పుకోనంత మాత్రానా నిప్పు కాల్చకుంటుందా...
చెప్పు చెలీ...................................
 నిప్పు కంటే ఎక్కువ ముప్పు కాదా నువ్వు ? ?
నన్ను నేను దహించుకుంటేనే .....నీవు నివ్వుగా దొరుకుతానంటావా ?
ఏది ఆ నిప్పును త్వరగా ఇవ్వు ... నీలో ఇప్పుడే చేరి పోవాలని వుంది ...


నాతో నేను


గాఢ మౌనం లో నాతో నేను ... ప్రస్తుతం నేను లేను .....

Sep 1, 2009

ప్రేమ లేఖ



ఎక్కడున్నావు ప్రియతమా ? నీవూ నాలాగా కట్టుబాట్లకు కట్టుబడిపొయావా ?
అనుబంధాల మధ్య నలిగింది చాలు ... నా హృదయాన్ని చేరి సేద తీరు నేడు.నీవు లేని తనాన్ని వదిలేసి , నీ లోకం లో విహరించాలి అని ఊహలు ఏవేవో కలలు కంటున్నాయి.. సంగీతం సరిగమలను వెతికినట్టు సంతోషం నిన్ను వెతుకుతూ బయలుదేరింది .. బాధ్యతలు ఊరుకుంటాయా నిరంకుశంగా దానిని వెనకకు లాగుతూనే ఉంటాయి. ఎక్కడున్నాను నేను ? ఎక్కడికి చేరుతాను ఏమో ?  నీకోసం ఇలా మిగిలాను.... మాటలతో సముదాయిస్తే మనసు వినదు ప్రియతమా .. నీవన్నా కావాలి లెదంటే మత్తునైనా అందివ్వాలి అంటోంది వెర్రి మనసు. నిజంగా ప్రేమ అంత దొరకనిదా ? అంతటా ఉంటుంది అని తృప్తి పడటమే కాని అందిపుచ్చుకొని ఆనంద పడింది లేదు.. కన్నీటి పొరల్లో దాగున్న కసి నన్ను నిందిస్తూ ఉంది నాకేమి పట్టదని.. సొమరిని అని.. నేనెలా చెప్పగలను నీవే నా బలం, నీవే నా బలహీనత కూడా అని. ప్రతిరోజూ వింత పోకడలతో స్పందించే హృదయ సవ్వడి... జీవితాన్ని కుదిపేస్తూ ఉంది.ఇఛ్ఛ మంటలోని నీలిమలా మారింది... మనసు మసి బారిన దీపం లా కూర్చుంది. వెలుగు ఆరక ముందే ఆదుకో.. ఆదుకొని అందుకో ..అందుకొని గుండెలో అదుముకో.. అదుముకొని అమృతంలో ముంచు .. నీలో ముంచుకొని నను కరుణించు... ఈ మానిసిక జాఢ్యాన్ని విదిలించి .. వదిలించి విడుదల చేయి..
వ్యక్తులు.. వ్యవహారాలు ...సంపదా..సంస్కారం ఇవన్నీ ప్రపంచంకోసం నేను వేసుకున్న ముసుగులుగా తోస్తున్నాయి.నీ రాక తెలియక పోతే నాకు నేనే ముసుగునవుతానేమో ? చెలీ కరుణించు ఎంతొ శ్రమకోర్చి బయటపడతాను నీ కోసం .. ఆ సమయంలో నీవుండవు ... మళ్ళీ కూరుకుపోతానేమో! భయంగా ఉంది


తత్త్వ శాస్త్రం,మానసిక శాస్త్రం,విజ్ఞాన శాస్త్రం,సామాజిక శాస్త్రం,ఇవన్నీ బుధ్ధిని బంధించగలిగాయి కాని... హృదయ వేదనను ఇసుమంతైన తేలిక పరచలేదు... నీవొచ్చే వరకు నేను మిగులుతానో లేదో ..కనీసం ఈ ప్రేమలేఖని చదువుతావని ... కాలంలో అవషేశంగా ... నీ విషేశంగా మిగులుదామని ... దుమ్ముకొట్టుకు పొయిన ఈ పనికిమాలిన మనసు ఆశ ... ఎవరు విన్నా వినక పోయినా ఇది చేరాల్సిన చోటికి చేరుతోందని నాకు తెలుసు..కాక పోతే నేనంటేనే నీకు అలుసు .. నిన్ను నిందించాలని లేదు ప్రియతమా ... నా దురదృష్టం అక్షరాలలొ అలా దొర్లుతూ ఉంది..నీకు కదలటం ఇష్టముండదు కదా అలాగే కూర్చో, నిన్ను నీవు మోసం చేసుకొంటూ ... చిరుగాలి నీ దరికి చేరుతుంది ఓ రొజు నా పరిమళాన్ని మోసుకుంటూ....
జీవితం రహస్యాలను ఒక్కోక్కటి విప్పుతూ ఉంటే ... గాఢ మౌనంలో,తనలో తాను లీనం అవుతూ ... హృదయం, మాటల్లో చెప్పలేని వింత ఘోష చేస్తూ ఉంది .. ఆ ఘోషలో నా ఆశ సంలీనమయ్యింది తిరిగి రాలేదు ఇంతవరకు ... నేను మిగిలి ఉంటే నీతో పాటు దానిని మోసుకొస్తావని ..నాలోని ఆశలకు ..అంతర్లీన నిరాశలకు ... నీతో స్వాంతన చేకూరుస్తావని .. మౌనంలోకి మునుగుతున్నాను.... ఉంటాను