బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
Sep 30, 2009
నా మనసు ... నీకు బాగా తెలుసు ....
ఉన్నదేదొ ఉత్సాహాన్నిచ్చి ............
లేనిదేదొ లేమిని రగిల్చి .................
నీ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తూ వికృతం అయ్యింది మనసు !
తెలిసిన వాళ్ళు కదా... తప్పకుండా ఇస్తారు!
ReplyDelete(అన్నయ్య)