Sep 11, 2009

వెలుగుల పులుగులు


మేము పక్షులం .. కడుపు నిండా తినటం , తనివి తీరా ఎగరటం మా నైజం ....
మా పక్షులకు ఆకలి మాత్రమే తెలుసు ... రుచుల కోసం వెంపర్లాడము
మాకు నిన్నటికి సంబంధించిన భారం ఉండదు
రేపటి కోసం ఆరాటమూ ఉండదు ..
వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ప్రకృతిని నిందించము
ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమి చేసుకోము .. పిల్లల కోసం ఒక గూడు .. దానిలోనే ఒకరికొకరం తోడు
ప్రేమ పేరు మీద మారణ హోమాలు మాకు తెలియవు
ఆడ పక్షి కువ కువ కూజితాలతో ఓ విచిత్రమైన అరుపులతో ఒక అలజడి సృష్టిస్తుంది
ఆ తరంగాలు మగ పక్షిలోని రసనేంద్రియాలను జాగృతి చేస్తుంది
ఆ పై ఒక బిగి కౌగిళి .....
మా శృంగారం మనసు పై ఆధార పడి ఉంటుంది .. దుస్తువులపై కాదు..
మా వలపుకు శరతులు ఉండవు .....
సిధ్ధాంతాలు రాధ్ధాంతాలు తెలియవు
మేము బ్రతికేది జీవితమని కూడా తెలియదు
కేవలం ఈ క్షణం ఇక్కడే బ్రతికేస్తూ ఉంటాము
అందరికీ అందరం ...ఒకరికి ఒకరం ... వలస వెల్లినా వరుసగా వెళ్తాం
అనవసరపు సలహాలు ... అనుమానాలు .. అవమానాలు ...
కర్ణకఠొరపు మాటలు , హేళనలు వెకిలి చేష్టలు ఉండనే ఉండవు
పిల్లల్ని పెంచటానికి ఎంత అనుబంధాన్ని పెంచుకుంటామో అంతే కఠువుగా బంధనాలు తెంపుకుంటాము
ఆర్థికంగా ఎవ్వరిపై అధారపడేది  ఉండదు కాబట్టి మొసాలు ఉండవు
డబ్బుకు సంబంధించిన జాఢ్యాలు మా దరి చేరవు
రసాయణ ఎరువుల వల్ల మేము తినే గింజల్లోని విషంతో మా సంతతి తగ్గుతూ ఉంది
అమాయకత్వం తప్ప బయట పడే ఆలోచన తెలియని మమ్మల్ని, మేధావులుగా పెరు పడ్డ మనుషులు
ఆదుకుంటారని అది కూడా వారి స్వార్థం కోసమే ఆదుకొమ్మని ఒక చిన్న విన్నపం ......
మనుషులతో నా విషయాలను పంచుకునే అవకాశం ఇచ్చిన భగవంతునికి ఋణపడి ఉంటాము
ఇట్లు
వెలుగుల పులుగులు