Oct 10, 2009

ఎవరు ఆపారు ఈ మృదుసంతకాల్ని ?ఆశల ప్రవాహాం.. అందులో నేను మునగటం తేలటం
ఆ పై నిన్ను తలవటం
అంతలోనే చూపులు నిలిపివేయటం
సిగ్గుతో నన్ను నిలదీయటం
ఎవరు ఆపారు ఈ మృదుసంతకాల్ని ?
నాకు నేనే అడ్డయ్యాను... నన్ను నేను ఎలా దాటగలను

చేరాల్సిన గమ్యం నీవు


జననంతో వెచ్చగా తోడుండి
మరణంతో చల్లబరచి పోతావు...
ప్రాణమా నిన్ను నేను నమ్మలేను
ప్రాణాధారమా .. కాస్త దాన్ని కరుణించు
ప్రణయమా త్వరగా త్వరపడు... చేరాల్సిన గమ్యం వైపు