Oct 10, 2009

ఎవరు ఆపారు ఈ మృదుసంతకాల్ని ?



ఆశల ప్రవాహాం.. అందులో నేను మునగటం తేలటం
ఆ పై నిన్ను తలవటం
అంతలోనే చూపులు నిలిపివేయటం
సిగ్గుతో నన్ను నిలదీయటం
ఎవరు ఆపారు ఈ మృదుసంతకాల్ని ?
నాకు నేనే అడ్డయ్యాను... నన్ను నేను ఎలా దాటగలను

1 comment:

  1. నాలోకే నేను పూర్తిగా కూరుకుపోయాను
    ఒక్కసారి నానుంచి నన్ను విడుదల చేయవూ!
    జామీ - సూఫీ కవి

    "నాకు నేనే అడ్డయ్యాను... నన్ను నేను ఎలా దాటగలను "

    ఎంత అందమైన భావనలు. కవి హృదయానికి ఎల్లలుండవనీ, అది కాలాతీతమనీ చెప్పటం లేదూ.

    ఈ చింతన నిరంతరం, ఎంత తోడుకొన్న వారికి అంత అమృతం సిద్దిస్తూంటుంది. దానిని అక్షరరాలలోకి ఒంపి అజరామరం చేసిది కవి మాత్రమే. ఒక్క కవి మాత్రమే.

    అందుకనే ఈనాటికీ కాళిదాసునో, షేక్స్పియర్నో, జామీనో చదువుకొంటూ, వారి వారి మనోలోకాలలో విహరిస్తూ ఆనందిస్తున్నాం.

    i wish to say through this comment, that your standard is not below the standard of such great lines.
    go ahead. there are people who mutely listen to you. yes there are "still" good listeners to good poetry as always been.

    good luck

    మీనుంచి మరిన్ని రచనలు ఆశిస్తూ

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete