Sep 23, 2009

కాలం


కాలమా .... నన్ను అలరించిన పిల్లగాలులు,చల్లని తీరాలు,పచ్చదనం,వెచ్చదనం,కల్లతో నవ్వే ప్రణయాలు,చిన్న చిన్న ఎడబాటులు,అద్భుతమైన ప్రదేశా లు,నన్ను అల్లుకున్న పసి హృదయాలు,ఆనందాలు,అవకాశాలు,విరహాలు, విలాపాలు,........అన్నీ నీలో నిక్షిప్తమై ఉన్నాయి....

ప్రేమ స్వరూపమా .... నేను చేయగల్గిందంతా నీవు నాకు అందించిన ప్రతి క్షణాన్ని అంగీరించటమే !!!
నీవు అందించిన అమృతాన్ని అందరితో పంచుకోవటం ....
నీవు అనుగ్రహించిన హాలాహలాన్ని ఒక్కన్నే అనుభవించటం....... 
ఆపై విష ప్రభావాన్ని వింత భావాల్లో నింపి కవిలు అల్లటం ...
నీ పాదాలకు వాటిని అంకితం చేయటం...
ఇదే తెలుసు నాకు కాలమా .... ఓ కాలకూఠమా ....
నాకు దేనిని నిందించాలి అనిపించదు..నీవు అందించిన ప్రేమ అలాంటిది ....

లేని దాని గురించి కాక ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని ...
 నీలో ఎలా అద్భుతంగా నిలిచి  పోవాలని నా ఆరాటం.. 
భవిష్యత్తు,యావత్తూ నీలోనే ఉంది 

నీలో నేను... నాలో నీవు.... నిరంతర పయణం ...
సాగి సాగి ఏదో ఒకరోజు నన్ను ఆపుతావు...
నీవు కొనసాగుతావు ...
నీకు హారంగా మిగులుతాయి నా భావాలు ...
అదే నాకు పదివేలు ...

1 comment:

  1. ఇక్కడ మాటల్లేవు... హారం పై నిలిచిన చూపులు తప్ప
    (అన్నయ్య)

    ReplyDelete