Oct 3, 2009

నీవు నేను కలిస్తే ఇలా ఉంటుంది


నీ అందం
నా అందం
జీవితపు మకరందం

నీ మౌనం
నా మౌనం
కన్నీరు



నీ జీవితం
నా జీవితం
ఈ జన్మ సరిపోదు

నీ అన్వేషణ
నా అన్వేషణ
ఒకే దగ్గర ముగిస్తుంది




నీ ఇష్టం
నా ఇష్టం
దోరగా పండిన పనస 

నీ పిలుపు
నా పిలుపు
పదాలకు ఊపిర్లూదుతున్న అర్ధాలు


నీ నవ్వులు
నా  నవ్వులు
నిశ్శబ్దం లో నీటి గల గలలు



నీ ధ్యానం
నా ధ్యానం
ఒకరిలో ఒకరం అంతర్ధానం



నీ పరిమళం
నా పరిమళం
విచ్చుకున్న ప్రేమ దళం



నీ కోరిక
నా కోరిక
అవసరం వద్ద ఆగాయి

 

1 comment:

  1. WOW..తుమ్మెద లాగా మకరందాన్ని జుర్రుకొని మధురానుభూతిని మాకందిస్తున్నావు... ఇప్పుడు అర్థం అయ్యింది కలవటానికి - కలిసిపోవటానికి మధ్య తేడా...!

    ReplyDelete