Oct 12, 2009

నిన్ను తెలుపుదామని...


ఎన్నో పదాలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నాయి...
                                                     నిన్ను తెలుపుదామని...
కొన్ని పదాలు మౌన తపస్సు చెపట్టాయి ..
                                               నీ భావాలని ద్విగుణీకృతం చేద్దామని..
కొన్ని కంటినిండా నీటితో ఉన్నాయి...
                                                    నీ ముందు ఒలుకుదామని
కొన్ని చిలిపితనంతో చిందులు వేస్తున్నాయి
                                                నీ సాంగత్యం లో కులుకుదామని ....
కొన్ని పదాలు నిప్పుల్లా మారాయి ...  
                                                  నీ హృదయానికి వెచ్చదనం పంచాలని....
కొన్ని పదాలు భావంలో మునిగి ఇంతవరకూ రాలేదు.....
               వాటిని నీతో పాటు తీసుకువస్తావని నాకు తెలుసు ....
                                            మైమరుపుతో మురిసిపోతోంది మనసు....

ఇట్లు
నీ మూర్తి


7 comments:

  1. I like the pic as you are taking all the hugs with your single write( I mean you are just flatting all with your kavitalu......great ra..keep it up- .!

    ReplyDelete
  2. బొమ్మకు తగినట్లుగా రాసినట్లు పైకి కనిపిస్తున్నా... గొల్లపల్లె వాసనలొస్తున్నాయి! అదే అదృష్టం నాకూ పట్టడానికి కాలంలో నేనింకా ఎంతదూరం పయనించాలో?????
    (అన్నయ్య)

    ReplyDelete
  3. అన్నయ్యకు :

    "మనసు గోపికైతే ... జీవితం గొల్ల పల్లెనే కదా ...నల్లని కన్నయ్యా
    అది మా అన్నయ్యకు చెప్పవయ్యా ...."

    ReplyDelete
  4. మాటల్లో చెప్పలేని భావాలను పదాలలో వ్యక్తపరచటమే కాకుండా.... హృదయానికి హత్తుకునేలా చేసిన నీ...గొప్పతనం ముందు... నా మనసు మూగదై పోయింది.. ఎలా స్పందించాలో తెలియక...!
    (Nitya)

    ReplyDelete
  5. ninu thelpu thanani super gaaaaaaaa undi itssssss niceeeeee

    ReplyDelete
  6. ఈ బొమ్మకు ఇంకా బాగా ఇంకో కవిత రాయండి

    ఎలా అంటే
    నా హృదయం లోని ప్రతి మాట తెలుపలనుకున్ననను
    ఏది చదువుతుంటే నే ను నిన్ను హత్తుకున్న ఫీలింగ్ కలగాలి

    మీ కవిత చదువుతుంటే ప్రతి శ్రోత కూడా ఇంట అమరమిన ద ప్రేమ అనుకోవాలి

    ReplyDelete