Oct 12, 2009

కడలి .... కన్నీరు




కడలిని ప్రేమించి కన్నీరు కార్చాను
అదేంటో అవి కూడా ఉప్పుగానే ఉన్నాయి
అప్పుడు తెలిసింది ........
అన్నిటికీ అధారం ప్రేమని
కడలికీ కన్నీటికీ ఆధారం ఒకటేనని

7 comments:

  1. పరమాత్మని ప్రేమించి భూదేవి కన్నీరు కార్చితే కడలి అయ్యింది... జీవానికి ఆధారం అయ్యింది!
    ఆ ప్రేమని ప్రేమించి నువ్వు కన్నీరు కార్చితే నీకు ప్రేమ అర్ధం అయ్యింది... నీ ఈ భావ...జీవ...కవితలకాధారం అయ్యింది!
    (అన్నయ్య)

    ReplyDelete
  2. సూక్ష్మమైన దానికీ.... స్థూలమైన దానికీ.....
    ఆధారం మాత్రం గొప్పదని నిరూపించావు........
    కన్నీటి బొట్టు లో కూడా కడలిని ప్రతిబింబించావు.....ప్రేమ తో...!Great.......!
    (Nitya)

    ReplyDelete
  3. నిత్య కు .........
    మీ బుధ్ధి సూక్ష్మతకి, హృదయ స్వచ్చతకి ముగ్ధుడను...
    నరసింహ మూర్తి

    ReplyDelete
  4. మూర్తి అన్నయ్య! నీ కవితలు ఎలా వున్నాయి అంటే నిన్ను నీవుగా నీ ఆలోచలనని పిండుకొని పిల్చి పిప్పి చేసిన రసాన్ని మాకందరికీ ...చక్కటి సందేశంగా అందిస్తున్నటుగుంది......

    ReplyDelete
  5. Dear Ravi,

    alaa anipisthey... nenu krutakrityunni ayyanu anukuntaanu....

    Warm regards,
    Narasimha Murthy

    ReplyDelete
  6. జగతికి ఆధారం ప్రేమ, ప్రేమకి మూలం పరమాత్మ. కడలి పొంగేది కన్నీటి అలల్లోనే, కన్నీరు నింపగా కడలి మాత్రమే తగు పాత్ర. ఆ రెండిటికీ ప్రేరణ ప్రేమరాహిత్యం.

    ReplyDelete
  7. ఉషగారికి నమస్కరించి ,
    మీ అనుభవాన్ని చక్కగా చెప్పారు.ప్రేరణ ప్రేమరాహిత్యం కాదు.నాకు ప్రేరణ విరహం.అది ప్రేమ లభించిన వారికే కల్గుతుంది.

    ReplyDelete