Oct 5, 2009

అర్హత


అర్హత, అందాన్ని ఆస్వాదించనీయదు ....
ఆలొచన, హృదయాన్ని అంకితం అవనివ్వదు...

4 comments:

  1. అందుకోవడానికి కాదు....అర్హత
    పొందడానికేమో...
    ఆచరించడానికి కాదు.....ఆలోచన
    అర్పించడానికేమో.....అనిపించింది!
    (Nitya)

    ReplyDelete
  2. అద్భుతంగా చెప్పారు.... మీ లాంటి సున్నిత హృదయులకోసమే ఈ బ్లాగ్ ఉన్నది... మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు
    నరసింహ మూర్తి

    ReplyDelete
  3. మూర్తి గారు...!
    మీ అమూల్యమైన నమస్కారాలను పొందగలిగేంత గొప్పదాన్ని కాదు నేను... మీరు మహా సముద్రం అయితే.... అందులో తేలియాడే ఒక చిన్న అల ను మాత్రమే.. నమస్కారాలను తెలిపే మీలోని సంస్కారానికి.... దాసోహం అంది నాలోని అహం... ఎంతో పుణ్యం చేసుకుంటే గాని .... ఈ రంగుల ప్రపంచం లోకి అడుగిడే అదృష్టం నాకు కలిగింది...అందులో నేను పంపిన comments మిమ్మల్ని ముగ్దున్ని చేసాయంటే.... నిజంగా నేను ధన్యురాలిని.
    వాస్తవానికి మీ యొక్క భావపారవశ్యానికి లోనైన ఙ్ఞాన సరస్వతీ దేవి మీ జిహ్వాగ్రము పై నృత్యం చేస్తూ నన్నొకసారి తొంగి చూసింది... అందుకే ఈ ఆణిముత్యం లాంటి వరం లభించింది నాకు. మీరు తలపెట్టిన ఈ యఙ్ఞం నిర్విఘ్నముగా కొనసాగాలని వాంఛిస్తూ..... మీలో మూర్తీభవించిన........గొప్ప భావుకత కలిగిన..... మీలాంటి
    "దివ్య మూర్తి"ని ఈ ధరణి పై మోపి... మా లాంటి వాళ్ళకు ధన్యత చేకూర్చిన..... ఆ "అమృత మూర్తి"కి శిరస్సు వంచి శతకోటి వందనాలను..... శాష్టాంగ ప్రణామాలుగా తెలుపుతూ ....! (నిత్య)

    ReplyDelete