Oct 9, 2009

అనుభూతి కలిపితే అంతరంగాలు


నన్ను నేను పరిచయం చేయాలా
నిండు కుండకు మట్టితెలియదా ?

నీలో మునిగితే తరంగాలు
అనుభూతి కలిపితే అంతరంగాలు

మురళికి తెలుసు నీ పెదవుల మృదువెంతో
కనులకు తెలుసు కనపడని మధువెంతో
చెవులకు తెలుసు... నీ పలుకుల మధురిమెంతో

వేటినడిగినా ఏదో ఒకటి చెబుతాయి
చెప్పలేని నేను
విప్పలేని నన్ను
విశాల గగనంలోకి విసిరాను
రసాణువులు నిన్ను చేరాలని
చేరి, పదిరెట్లై నాపై కురవాలని

3 comments:

  1. పిల్లనగ్రోవి కి తెలుసు....పిల్లగాలి సోయగాల మెలికలు...
    నీ భావాలకు తెలుసు.... ఆ సుస్వరాల మెలకువలు...
    అవి వేణు గానాన్ని వినసొంపు గా వివరిస్తున్నాయి.........
    అవన్నీ మయూర నృత్యాన్ని ఆనవాలు గా తెలుపుతూ.....వర్షిస్తున్నాయి!
    (Nitya)

    ReplyDelete
  2. బృందావనాన్ని ఆస్వాదించగల్గటం.. మహానుభావుల కటాక్షం గా భావిస్తాను.. నా భావుకత వల్ల ... మీకూ ఆ గాలి తగిలినందుకు ... హర్షిస్తూ
    నరసింహ మూర్తి

    ReplyDelete
  3. baagundandi!
    manasuku avi nachaayi ani thelusukovataani ki kondariki oka jeevitha kaalam paduthundhi

    baagundandi mee bhavaavishkarana

    ReplyDelete