
కాలమా నీ ప్రతి బింబమే నా జీవితం ......
బ్రతకటం లో కళ నీకే అంకితం ...
కదులుతూ కదులుతూ కాలం ...
సృష్టిస్తుంది ఎదలో కలకళం
ప్రేమా ...
నీవైనా కాస్త కాలాన్ని ఆపుమా....
బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని. మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి. ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ... భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను... ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి