Sep 30, 2009

నా మనసు ... నీకు బాగా తెలుసు ....


ఉన్నదేదొ ఉత్సాహాన్నిచ్చి ............
                        లేనిదేదొ లేమిని రగిల్చి  .................
నీ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తూ వికృతం అయ్యింది మనసు !
                                దానికేమి కావాలో నీకు బాగా తెలుసు !!!

Sep 26, 2009

जानम इज़हार तो करो .... तेरी अदाए ही सही ......


जुदाई जिस्मोंकी होसकती है.... यादोंकी नहीं
बेवफाई बातो में हो सकती है .... दिल में नहीं
जानम इज़हार तो करो .... तेरी अदाए ही सही ......

Sep 25, 2009

లోతైన అనుకూలత నీవు


తీవ్ర వ్యతిరేకతల మధ్య ..... లోతైన అనుకూలత నీవు...

నీ చలవే


ప్రపంచమంతా నిప్పులు కురుస్తున్నా ...
నింపాదిగా ఉన్నానంటే అది నీ చలవే ....

Sep 24, 2009

నీ భావాలే కానుకగా నీ ముందు పెడతాను


తప్పంతా నాదేనని నిలబెడితే

తప్పుకోలేను ప్రియతమా ....

నిలబడ్డ దగ్గరే నిలువునా కరిగి పోతాను

నీ భావాలే కానుకగా నీ ముందు పెడతాను

Sep 23, 2009

కాలం


కాలమా .... నన్ను అలరించిన పిల్లగాలులు,చల్లని తీరాలు,పచ్చదనం,వెచ్చదనం,కల్లతో నవ్వే ప్రణయాలు,చిన్న చిన్న ఎడబాటులు,అద్భుతమైన ప్రదేశా లు,నన్ను అల్లుకున్న పసి హృదయాలు,ఆనందాలు,అవకాశాలు,విరహాలు, విలాపాలు,........అన్నీ నీలో నిక్షిప్తమై ఉన్నాయి....

ప్రేమ స్వరూపమా .... నేను చేయగల్గిందంతా నీవు నాకు అందించిన ప్రతి క్షణాన్ని అంగీరించటమే !!!
నీవు అందించిన అమృతాన్ని అందరితో పంచుకోవటం ....
నీవు అనుగ్రహించిన హాలాహలాన్ని ఒక్కన్నే అనుభవించటం....... 
ఆపై విష ప్రభావాన్ని వింత భావాల్లో నింపి కవిలు అల్లటం ...
నీ పాదాలకు వాటిని అంకితం చేయటం...
ఇదే తెలుసు నాకు కాలమా .... ఓ కాలకూఠమా ....
నాకు దేనిని నిందించాలి అనిపించదు..నీవు అందించిన ప్రేమ అలాంటిది ....

లేని దాని గురించి కాక ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని ...
 నీలో ఎలా అద్భుతంగా నిలిచి  పోవాలని నా ఆరాటం.. 
భవిష్యత్తు,యావత్తూ నీలోనే ఉంది 

నీలో నేను... నాలో నీవు.... నిరంతర పయణం ...
సాగి సాగి ఏదో ఒకరోజు నన్ను ఆపుతావు...
నీవు కొనసాగుతావు ...
నీకు హారంగా మిగులుతాయి నా భావాలు ...
అదే నాకు పదివేలు ...

Sep 22, 2009

నిన్ను చేరి



  
 నా అసంపూర్ణ భావాలు బయలు దేరాయి... నిన్ను చేరి సంపూర్ణం అవుదామని..

అనుభూతి

మెలకువలో పొందిన అనుభూతి .. రాత్రివేళ అందమైన కన్నెలా కలవరపెడుతూ ఉంది...

అదే పనిగా ... అదికూడా




అదేపనిగా చేస్తున్నానంటే ... అది నీకోసమై ఉంటుంది...

అదికూడా చేస్తున్నాను అంటే ... అది ప్రపంచం కొసమై ఉంటుంది..

Sep 16, 2009

క్షమించు...

                                    
నీ అధీనం లో ఉండటం పరాధీనమయితే క్షమించు
మరువలేను నిన్ను మన్నించు
నిన్ను ఆశించటం కుసంస్కారమయితే క్షమించు
వ్యక్తీకరణ వ్యక్తి తప్పయితే క్షమించు
బాధను భావముగా తెలపటం రాదు క్షమించు
నీకై కరిగిన ఈ గుండెని క్షమించు
నాది పుష్ప పరాగ వివశత మన్నించు
చల్ల గాలికి మెఘం వర్షిస్తే .. మేఘాన్ని క్షమించు
దాచటం తెలియదు ... దాచలేను .... క్షమించు
నిన్ను చూసినందుకు ... నా కళ్ళను క్షమించు
నీ మృదువచనాలు విన్న చెవులను మన్నించు
ఇన్ని భావాలను ఆగకుండా సృష్టిస్తున్న నా మనసుని క్షమించు
నీ పేరుతో స్పందించే .. ఈ హృదాయాన్ని క్షమించు
నేను అర్థం కాక పొతే క్షమించు
నా జీవితం వ్యర్తమైనా నీ ప్రేమను మరువను క్షమించు
కదలని చూపులతో కాలం కదిలిస్తున్నా క్షమించు
నా నిదురకూడా నన్ను క్షమించటం లేదు .. నీవైనా క్షమించు
నన్ను నేను క్షమించలేక పోతున్నాను నీవైనా క్షమించు