తీవ్ర వ్యతిరేకతల మధ్య ..... లోతైన అనుకూలత నీవు...
బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని. మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి. ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ... భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను... ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
Sep 25, 2009
Sep 24, 2009
నీ భావాలే కానుకగా నీ ముందు పెడతాను
తప్పంతా నాదేనని నిలబెడితే
తప్పుకోలేను ప్రియతమా ....
నిలబడ్డ దగ్గరే నిలువునా కరిగి పోతాను
నీ భావాలే కానుకగా నీ ముందు పెడతాను
Sep 23, 2009
కాలం
కాలమా .... నన్ను అలరించిన పిల్లగాలులు,చల్లని తీరాలు,పచ్చదనం,వెచ్చదనం,కల్లతో నవ్వే ప్రణయాలు,చిన్న చిన్న ఎడబాటులు,అద్భుతమైన ప్రదేశా లు,నన్ను అల్లుకున్న పసి హృదయాలు,ఆనందాలు,అవకాశాలు,విరహాలు, విలాపాలు,........అన్నీ నీలో నిక్షిప్తమై ఉన్నాయి....
ప్రేమ స్వరూపమా .... నేను చేయగల్గిందంతా నీవు నాకు అందించిన ప్రతి క్షణాన్ని అంగీరించటమే !!!
నీవు అందించిన అమృతాన్ని అందరితో పంచుకోవటం ....
నీవు అనుగ్రహించిన హాలాహలాన్ని ఒక్కన్నే అనుభవించటం.......
ఆపై విష ప్రభావాన్ని వింత భావాల్లో నింపి కవితలు అల్లటం ...
నీ పాదాలకు వాటిని అంకితం చేయటం...
ఇదే తెలుసు నాకు కాలమా .... ఓ కాలకూఠమా ....
నాకు దేనిని నిందించాలి అనిపించదు..నీవు అందించిన ప్రేమ అలాంటిది ....
లేని దాని గురించి కాక ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని ...
నీలో ఎలా అద్భుతంగా నిలిచి పోవాలని నా ఆరాటం..
లేని దాని గురించి కాక ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని ...
నీలో ఎలా అద్భుతంగా నిలిచి పోవాలని నా ఆరాటం..
భవిష్యత్తు,యావత్తూ నీలోనే ఉంది
నీలో నేను... నాలో నీవు.... నిరంతర పయణం ...
సాగి సాగి ఏదో ఒకరోజు నన్ను ఆపుతావు...
నీవు కొనసాగుతావు ...
నీకు హారంగా మిగులుతాయి నా భావాలు ...
అదే నాకు పదివేలు ...
సాగి సాగి ఏదో ఒకరోజు నన్ను ఆపుతావు...
నీవు కొనసాగుతావు ...
నీకు హారంగా మిగులుతాయి నా భావాలు ...
అదే నాకు పదివేలు ...
Sep 22, 2009
అదే పనిగా ... అదికూడా
అదేపనిగా చేస్తున్నానంటే ... అది నీకోసమై ఉంటుంది...
అదికూడా చేస్తున్నాను అంటే ... అది ప్రపంచం కొసమై ఉంటుంది..
Sep 16, 2009
క్షమించు...
నీ అధీనం లో ఉండటం పరాధీనమయితే క్షమించు
మరువలేను నిన్ను మన్నించు
నిన్ను ఆశించటం కుసంస్కారమయితే క్షమించు
వ్యక్తీకరణ వ్యక్తి తప్పయితే క్షమించు
బాధను భావముగా తెలపటం రాదు క్షమించు
నీకై కరిగిన ఈ గుండెని క్షమించు
నాది పుష్ప పరాగ వివశత మన్నించు
చల్ల గాలికి మెఘం వర్షిస్తే .. మేఘాన్ని క్షమించు
దాచటం తెలియదు ... దాచలేను .... క్షమించు
నిన్ను చూసినందుకు ... నా కళ్ళను క్షమించు
నీ మృదువచనాలు విన్న చెవులను మన్నించు
ఇన్ని భావాలను ఆగకుండా సృష్టిస్తున్న నా మనసుని క్షమించు
నీ పేరుతో స్పందించే .. ఈ హృదాయాన్ని క్షమించు
నేను అర్థం కాక పొతే క్షమించు
నా జీవితం వ్యర్తమైనా నీ ప్రేమను మరువను క్షమించు
కదలని చూపులతో కాలం కదిలిస్తున్నా క్షమించు
నా నిదురకూడా నన్ను క్షమించటం లేదు .. నీవైనా క్షమించు
నన్ను నేను క్షమించలేక పోతున్నాను నీవైనా క్షమించు
Sep 11, 2009
వెలుగుల పులుగులు
మేము పక్షులం .. కడుపు నిండా తినటం , తనివి తీరా ఎగరటం మా నైజం ....
మా పక్షులకు ఆకలి మాత్రమే తెలుసు ... రుచుల కోసం వెంపర్లాడము
మాకు నిన్నటికి సంబంధించిన భారం ఉండదు
రేపటి కోసం ఆరాటమూ ఉండదు ..
వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ప్రకృతిని నిందించము
ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమి చేసుకోము .. పిల్లల కోసం ఒక గూడు .. దానిలోనే ఒకరికొకరం తోడు
ప్రేమ పేరు మీద మారణ హోమాలు మాకు తెలియవు
ఆడ పక్షి కువ కువ కూజితాలతో ఓ విచిత్రమైన అరుపులతో ఒక అలజడి సృష్టిస్తుంది
ఆ తరంగాలు మగ పక్షిలోని రసనేంద్రియాలను జాగృతి చేస్తుంది
ఆ పై ఒక బిగి కౌగిళి .....
మా శృంగారం మనసు పై ఆధార పడి ఉంటుంది .. దుస్తువులపై కాదు..
మా వలపుకు శరతులు ఉండవు .....
సిధ్ధాంతాలు రాధ్ధాంతాలు తెలియవు
మేము బ్రతికేది జీవితమని కూడా తెలియదు
కేవలం ఈ క్షణం ఇక్కడే బ్రతికేస్తూ ఉంటాము
అందరికీ అందరం ...ఒకరికి ఒకరం ... వలస వెల్లినా వరుసగా వెళ్తాం
అనవసరపు సలహాలు ... అనుమానాలు .. అవమానాలు ...
కర్ణకఠొరపు మాటలు , హేళనలు వెకిలి చేష్టలు ఉండనే ఉండవు
పిల్లల్ని పెంచటానికి ఎంత అనుబంధాన్ని పెంచుకుంటామో అంతే కఠువుగా బంధనాలు తెంపుకుంటాము
ఆర్థికంగా ఎవ్వరిపై అధారపడేది ఉండదు కాబట్టి మొసాలు ఉండవు
డబ్బుకు సంబంధించిన జాఢ్యాలు మా దరి చేరవు
రసాయణ ఎరువుల వల్ల మేము తినే గింజల్లోని విషంతో మా సంతతి తగ్గుతూ ఉంది
అమాయకత్వం తప్ప బయట పడే ఆలోచన తెలియని మమ్మల్ని, మేధావులుగా పెరు పడ్డ మనుషులు
ఆదుకుంటారని అది కూడా వారి స్వార్థం కోసమే ఆదుకొమ్మని ఒక చిన్న విన్నపం ......
మనుషులతో నా విషయాలను పంచుకునే అవకాశం ఇచ్చిన భగవంతునికి ఋణపడి ఉంటాము
ఇట్లు

Sep 9, 2009
A red rose is in love
A red rose is in love
being mesmarised in a red radiant romantic wave
each petal of it is becoming heavy
feeling as fascinatedly savvy
Subscribe to:
Posts (Atom)